: ప్రాణాలు తీయకుండా, అంతపనీ చేసే ఆయుధాల వాడకానికి భద్రతా బలగాలకు అనుమతి
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ హత్యానంతరం కాశ్మీరు లోయలో నెలకొన్న ఆందోళనలు ఎంతకూ తగ్గకపోవడంతో, సైన్యం, కాశ్మీర్ పోలీసులు ప్రాణాలను హరించని ఆయుధాలను వాడేందుకు అనుమతి లభించింది. లోయలో ఆందోళనలకు దిగుతున్న వారిపై పెల్లెట్ గన్స్ వాడకం వివాదం రేపిన నేథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ ప్రాణాలు తీసే అవకాశాలున్న ఆయుధాలకు బదులు, అంతపనీ చేసి, ఆందోళనకారులను వెంటనే చెదరగొట్టేలా మిరప గ్రనేడ్లు, పెప్పర్ షాట్లు, వేడి కిరణాలను వదిలే సోనిక్ వెపన్స్ వాడాలని సూచించింది. తమ సైన్యానికి తక్కువ హాని చేసే ఆయుధాలను వాడేందుకు అనుమతి లభించిందని నార్త్ రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా వెల్లడించారు. ఈ ఆయుధాలు వాడితే, అల్లరిమూకలు ఉక్కిరిబిక్కిరై పలాయనం చిత్తగిస్తాయని, దాంతో ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకోవచ్చని వివరించారు.