: కశ్మీర్‌లో మరో ఇద్దరు ఆందోళనకారుల మృతి.. 64కు పెరిగిన మృతుల సంఖ్య
జమ్ముకశ్మీర్‌లో కల్లోల పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ తరహా ఆంక్షలు విధించారు. ఈరోజు బుద్గామ్ జిల్లాలో ఆందోళనకారులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతాబలగాలపై విరుచుకుపడ్డారు. దీంతో ఆందోళనకారులు, భద్రతాబలగాలకు మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపాయి. దీంతో మరో ఇద్దరు ఆందోళనకారులు మృతి చెందారు. దీంతో, హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత చెలరేగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 64కు పెరిగింది.