: మూడు రోజుల నుంచి ఎటూ కదలని శ్రీశైలం రిజర్వాయర్!
గడచిన మూడు రోజుల నుంచి శ్రీశైలం జలాశయంలో చుక్క నీరు పెరగలేదు, తగ్గలేదు. 885 అడుగుల పూర్తి స్థాయి నీటిమట్టమున్న డ్యాములో శనివారం నాటికే 875 అడుగులకు నీరు చేరుకోగా, అప్పటి నుంచి పుష్కర అవసరాల నిమిత్తం నీటిని కిందకు వదులుతున్నారు. వస్తున్న నీటిని వస్తున్నట్టు వదులుతూ, 875 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం 10 గంటల సమయానికి శ్రీశైలానికి వస్తున్న వరదనీరు గణనీయంగా తగ్గి 16 వేల క్యూసెక్కులకు చేరగా, 33,564 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. రాయలసీమకు వదుతున్న నీరు మినహాయిస్తే, నాగార్జున సాగర్ కు 19,339 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీనిలో 17,071 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.