: ఏపీ మాకెంతో ప్రత్యేకం, హోదాపై త్వరలో నిర్ణయం: కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్ వాల్


కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రత్యేకమని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్ వాల్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కృష్ణా పుష్కర పుణ్య స్నానం నిమిత్తం విజయవాడకు వచ్చిన ఆయన, ఇంద్రకీలాద్రి సమీపంలోని దుర్గా ఘాట్ లో స్నానం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై ఇప్పటికే పార్లమెంటులో చర్చ జరిగిందని, త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని అన్నారు. ఆపై అర్జున్ మేఘ్ వాల్ దుర్గమ్మ దర్శనానికి వెళ్లగా, ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

  • Loading...

More Telugu News