: శరీరం అక్కడే, మనసు మాత్రం లేదు: ఎర్రకోట వద్ద నిద్ర ఘటనపై కేజ్రీవాల్
70వ స్వాతంత్ర్యదిన వేడుకల వేళ, ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తుండగా, పలువురు కేంద్ర మంత్రులు, వీఐపీలు నిద్రమత్తులో జోగుతూ కనిపించడాన్ని పలు పత్రికలు ప్రముఖంగా ప్రచురించిన వేళ, డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. ఆయన ప్రసంగం తనతో పాటు సీనియర్ మంత్రులు అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్ కు కూడా బోర్ కొట్టించిందని ఆయన అన్నారు. తన శరీరం మాత్రమే ఎర్రకోట వద్ద ఉందని, మనసు అక్కడ లేదని, ఆయన ఏం మాట్లాడారన్నది తాను వినలేదని ఆయన అన్నారు. ప్రధాని ప్రసంగం దాదాపు గంటన్నర పాటు సాగగా, పలువురు కళ్లు మూసుకుని ఉండటం మీడియా కెమెరాలకు చిక్కిన సంగతి తెలిసిందే.