: షేక్ హ్యాండ్ ఇవ్వనందుకు జూడో ఆటగాడిని బహిష్కరించిన ఒలింపిక్స్


ఒలింపిక్స్ నిబంధనలను పాటించకుండా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడన్న ఆరోపణలపై ఈజిప్టు జూడో క్రీడాకారుడు ఇస్లాం ఎల్ షిహామీని బహిష్కరిస్తున్నట్టు ఒలింపిక్స్ కమిటీ ప్రకటించింది. జూడో నిబంధనల ప్రకారం, పోటీకి ముందు వంగి అభివాదం చేయడం, ముగిశాక షేక్ హ్యాండ్ ఇవ్వడం తప్పనిసరి. ఇజ్రాయిల్ కు చెందిన సుస్సున్ అనే పోటీదారుతో బౌట్ తరువాత షిహామీ కరచాలనానికి నిరాకరించాడు. ఆపై ఈ చర్యను తీవ్రంగా తప్పుబట్టిన ఒలింపిక్ కమిటీ, అతన్ని స్వదేశానికి తిరిగి పంపింది. కాగా, ఇందులో తన తప్పు లేదని, తన దేశంలోని మత ఛాందస వాదుల హెచ్చరికల కారణంగానే చేతులు కలిపేందుకు నిరాకరించానని షిహామీ వెల్లడించినా ఫలితం లేకపోయింది. ఆటగాళ్లను పంపేముందు నిబంధనలు, క్రీడాస్ఫూర్తి, వాటి విలువల గురించి ముందుగానే తెలియజేయాల్సి వుంటుందని కమిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ బహిష్కరణ నిర్ణయాన్ని ఈజిప్టు ఒలింపిక్ కమిటీ కూడా ఆమోదించిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News