: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 48 గంటల్లో మరింత బలపడే అవకాశం
ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్టు తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో మంగళవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు. కోస్తాలో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని విశాఖపట్నం లోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఇక సోమవారం విశాఖలో భారీ వర్షం పడింది. విమానాశ్రయంలో మూడు సెంటీమీటర్లు, వాల్తేరులో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.