: నయీమ్ మామూలోడు కాదు.. అవసరమైతే ప్రముఖులనూ ఇరికించే ఏర్పాట్లు


షాద్‌నగర్‌లో పోలీసుల చేతిలో ఎన్‌కౌంటరైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ తెలివితేటలు అద్భుతమని పోలీసులే చెబుతున్నారు. రాజకీయ నాయకుల నుంచి పోలీసుల వరకు అందరితోనూ ‘సత్సంబంధాలు’ కలిగిన నయీమ్ తనకేదైనా జరిగితే వారినీ ఇరికించేందుకు పక్కా ప్రణాళికలు తయారుచేసుకున్నాడు. వారితో ఫోన్లో మాట్లాడిన ప్రతిసారీ ఆ సంభాషణలను రికార్డు చేసినట్టు అనుమానిస్తున్నారు. అంతేకాదు, వారిని కలిసే సందర్భాల్లో ఫొటోలు దిగేవాడని తెలిసింది. ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. తన ప్రాణాలకు ఎప్పటికైనా ముప్పు ఉందని తెలిసే నయీమ్ ఇలా చేసేవాడని అంటున్నారు. జరగరానిది జరిగి పట్టుబడితే తనతో పాటు ప్రముఖులను కూడా ఇరికించేందుకే ఈ ఏర్పాట్లు చేసి ఉంటాడని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News