: 'ఇంకొక్కడు' బాగుంటుంది...అందర్నీ అలరిస్తుంది: విక్రమ్
'ఇంకొక్కడు' ట్రైలర్ నచ్చిందా? అని సినీ నటుడు విక్రమ్ అభిమానులను ప్రశ్నించాడు. ఈ సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో అభిమానులను చాలా రోజుల తరువాత కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో 'అకీరన్' పాత్ర నచ్చిందా? 'లవ్' పాత్ర నచ్చిందా? అని ఆయన అభిమానులను ప్రశ్నించాడు. 'బాహుబలి' సినిమాలో చూడడానికి ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా ఉంటుందని, అలాంటి ఐ ఫీస్ట్ ను 'ఇంకొక్కడు' సినిమాలో చూడవచ్చని ఆయన చెప్పాడు. సినీ ప్రేమికుల కోసం నిజాయతీగా మంచి కథతో, అద్భుతమైన కథనంతో మంచి ప్రయత్నం చేశామని ఆయన చెప్పారు. తన కెరీర్ లో ఈ సినిమాలో పాత్రలు మైలు రాళ్లుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.