: 'ఇంకొక్కడు' ట్రైలర్ అద్భుతంగా ఉంది: ప్రగ్య జైస్వాల్
'ఇంకొక్కడు' ట్రైలర్ అద్భుతంగా ఉందని సినీ నటి, 'కంచె' ఫేమ్ ప్రగ్య జైస్వాల్ తెలిపింది. 'ఇంకొక్కడు' ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, 'చియ్యాన్' విక్రమ్ గారు ఎప్పట్లానే ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తేందుకు సిద్ధమయ్యారని చెప్పింది. విక్రమ్ సినిమా అంటే ప్రతిసారి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తానని తెలిపింది. ప్రతి సినిమాలో ఆయన తన పాత్రలతో ఆశ్చర్యానికి గురి చేస్తుంటారని చెప్పింది. ఈ సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ట్రైలర్ చూస్తేనే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనిపిస్తోందని ప్రగ్య అభిప్రాయపడింది. సినిమా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలని ఆమె చెప్పింది.