: ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు: జేసీ దివాకర్ రెడ్డి


జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలి వ్యాఖ్యలతో కలకలం రేపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా సాధించి తీరుతామని, ఎన్డీయే రాష్ట్రానికి న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి పలుమార్లు చెబుతున్నప్పటికీ హోదా రాదని జేసీ స్పష్టం చేయడం విశేషం. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అవకాశం కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఏపీకి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ నీటి ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించే తీరు హర్షణీయమని ఆయన అభినందించారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో కూడా అందరూ విభజనను ఆపుతామని చెబితే... రాష్ట్రం ముక్కలై తీరుతుందని జేసీ చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News