: 'ఇద్దరు చంద్రుల'తో ఎట్ హోం కార్యక్రమం నిండు పున్నమిలా ఉంది: గవర్నర్
ఇద్దరు చంద్రులు ఒకే వేదికపై కనువిందు చేయడంతో ఇది తనకు నిండుపున్నమిలా కనిపిస్తోందని ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ తెలిపారు. హైదరాబాదులోని రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఇద్దరు చంద్రులు ఒకే వేదికపై కనిపించడం ఆనందంగా ఉందని అన్నారు. ఎట్ హోం కు మీరు (జగన్) రావడం సంతోషంగా ఉందని జగన్ ని ఉద్దేశించి అన్నారు. ఎట్ హోం ముగిసేవరకు ఉండాలని ఆయన జగన్ ను కోరారు. ఈ సందర్భంగా రిషికేష్ పర్యటన వివరాలను గవర్నర్ సతీమణి విమల జగన్ ను అడిగి తెలుసుకున్నారు. అయినప్పటికీ చంద్రబాబు కన్నా ముందే ఎట్ హోమ్ నుంచి జగన్ వెళ్లిపోవడం విశేషం.