: ఎట్ హోం కార్యక్రమంలో బాబును పట్టించుకోని జగన్
స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గవర్నర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎదురుపడ్డారు. ఈ సమయంలో జగన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభివాదం చేసి, చంద్రబాబును పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. దీంతో శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి జగన్ వద్దకు చేరుకుని అది సరికాదని, ముఖ్యమంత్రిని పలకరించడం పద్ధతని చెప్పి, స్వయంగా చంద్రబాబు వద్దకు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో జగన్, చంద్రబాబుకు అభివాదం చేశారు.