: 2020 వరకు నాకు ఈ రాజ్యసభ సభ్యత్వం ఉంటుంది...పొగడ్త ఇష్టం లేనిదెవరికి?: సుబ్బరామిరెడ్డి
2020 వరకు రాజ్యసభ సభ్యుడిగా తన పదవీ కాలం ఉండగా, 2019 లో వేరే పార్టీ తరపున పోటీ చేయాల్సిన అవసరం తనకు లేదని సుబ్బరామిరెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, 2019కి ఇంకా చాలా సమయం ఉండగా, దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించి ఆరోగ్యం పోగొట్టుకోవాల్సిన అవసరం ఏంటని అడిగారు. అసలు పొగడ్తలకు పొంగిపోని మనిషి ఎవరని ఆయన ప్రశ్నించారు. ఇతరులను ఆనందంగా ఉంచుతాను కనుకే తాను ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నానని ఆయన చెప్పారు. సినీ నటులకు పురస్కారాలు అందించడం వల్ల చాలా మంది ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. అందరినీ ఆలా ఆనందంగా ఉంచడమే తనకు ఆనందమని ఆయన చెప్పారు. తాను సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులివ్వనన్న ఆరోపణలు కేవలం 10 శాతం మంది మాత్రమే చేస్తారని, మిగిలిన 90 శాతం మంది హాయిగా పని చేస్తుంటారని, అలాంటి ఆరోపణలను పట్టించుకోనని ఆయన తెలిపారు.