: గిటార్ వాయిస్తూ రాక్ స్టార్ అవతారమెత్తిన మంత్రి రావెల
ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు రాక్ స్టార్ అవతారమెత్తారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రామకృష్ణాపురంలో జరిగిన 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రావెలలోని కళాకారుడు బయటకు వచ్చాడు. వేడుకల్లో పాల్గొనడానికి గురుకుల పాఠశాలకు వచ్చిన రావెల, అక్కడ ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాలోని గిటార్ ను తీసుకున్న ఆయన, దాన్ని వాయిస్తూ, ఆహూతులను అలరించడమే కాకుండా, విద్యార్థులతో కలసి స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలల్లో ఈ తరహా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థుల్లో ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతాయని, ఆ ప్రభావం విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. రావెల ఇంత బాగా గిటార్ వాయించగలరని తాము అనుకోలేదని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం.