: 14 కంపెనీలను డీలిస్ట్ చేయనున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్... 31 నుంచి ట్రేడింగ్ బంద్
14 కంపెనీలు తమ వ్యాపారాలను మూసివేసే ప్రక్రియను ప్రారంభించినందున, ఈ నెల 31 నుంచి వాటి ట్రేడింగ్ ను నిలిపివేస్తున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. గత ఏప్రిల్ లో 80 కంపెనీలను డీలీస్ట్ చేసినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా డీలిస్ట్ కానున్న కంపెనీల్లో కెమోక్స్ కెమెకల్ ఇండస్ట్రీస్, గణపతి ఎక్స్ పోర్ట్స్, హామ్కో మైనింగ్ అండ్ స్మెల్టింగ్, మాన్షుక్ ఇండస్ట్రీస్, మార్డియా కెమెకల్స్, మార్డియా స్టీల్, పాల్ ప్యూగోట్, పొన్ని షుగర్స్, ప్రుడెన్షియల్ క్యాపిటల్ మార్కెట్స్, ఎస్ఐవీ ఇండస్ట్రీస్, వైబ్రెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీస్ తదితర సంస్థలున్నాయి. ఇప్పటికే ఈ కంపెనీల్లో ఎలాంటి లావాదేవీలూ జరగడం లేదని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.