: కాటేదాన్ లో భారీ అగ్ని ప్రమాదం


హైదరాబాద్‌ శివారులోని పారిశ్రామిక ప్రాంతం కాటేదాన్‌ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్‌ నగర్‌ లో ప్లాస్టిక్‌ పరికరాల తయారీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో కంపెనీని చుట్టుముట్టిన మంటలు పక్కనే ఉన్న ఇంకో పరిశ్రమకు విస్తరించాయి. ప్రమాద ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే నేడు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలవు ప్రకటించడంతో పరిశ్రమ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. లేని పక్షంలో ప్రాణనష్టం కూడా సంభవించి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఆస్తినష్టంపై వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

  • Loading...

More Telugu News