: గుంటూరు జిల్లాలో 366 మీటర్ల జెండా ప్రదర్శన


గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని మన్నె పుల్లారెడ్డి హై స్కూల్ లో 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. లీపు సంవత్సరాన్ని పురస్కరించుకుని దానికి సూచనగా 366 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలో సుమారు 4 వేల మంది విద్యార్థులు, 5 వేల మంది పట్టణ ప్రజలు పాలుపంచుకున్నారు. పిడుగురాళ్లకు చెందిన వ్యాపారి కాకుమాను జగన్నాథం ఈ జెండాను స్కూలుకు బహూకరించారు. అనంతరం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ స్కూల్ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News