: మద్యం సేవించి కారు నడుపుతూ దొరికిపోయిన స్వీడన్ మహిళా మంత్రి... తప్పు అంగీకరించి రాజీనామా


మద్యం సేవించి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డ స్వీడన్ మంత్రి అయిదా హెజడిక్, తప్పును అంగీకరించి, తన పదవికి రాజీనామా చేశారు. బోస్నియా నుంచి చిన్న వయసులోనే శరణార్థిగా వచ్చి స్వీడన్ లో స్థిరపడిన హెజడిక్ 29 ఏళ్ల వయసులోనే ప్రజాభిమాన్ని చూరగొని ప్రస్తుతం మాధ్యమిక, వయోజన విద్యా శాఖల మంత్రిగా ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్న ఆమెను పోలీసులు ఆపి తనిఖీ చేయగా, మోతాదుకు మించి మద్యం తాగివున్నట్టు తేలింది. ఇదే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పని వాపోయిన హెజడిక్, తప్పుకు బాధ్యత వహిస్తున్నానని, తనను నమ్మినవారికి తీవ్ర నిరాశను కలిగించానని ఇప్పుడు బాధపడుతోంది.

  • Loading...

More Telugu News