: ఐదేళ్ల బాలికకు చాక్లెట్ చూపించి కిడ్నాప్... హైదరాబాద్ లో కలకలం


హర్షిత అనే ఐదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ చేసిందో యువతి. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని అడిక్ మెట్ లో జరుగగా, ఘటన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. హర్షిత ఎరుపు రంగు డ్రస్ వేసుకుని రోడ్డుపై ఉన్న వేళ, ఓ యువతి వచ్చి చాక్లెట్ చూపించి కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ లన్నీ పరిశీలిస్తూ, కిడ్నాప్ చేసిన యువతి ఏ వైపు వెళ్లిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. హర్షిత ఎక్కడుందో కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

  • Loading...

More Telugu News