: నౌహట్టాలో కొనసాగుతున్న ఎన్ కౌంటర్, సీఆర్పీఎఫ్ జవాను మృతి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బరితెగిస్తే, వారికి ఎదురొడ్డి నిలిచి పోరాడిన ఓ జవాను అమరుడయ్యాడు. ఈ ఉదయం నుంచి శ్రీనగర్ లోని నౌహట్టా ప్రాంతంలో ఉగ్రవాదులకు, సీఆర్పీఎఫ్ భద్రతా దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరుగుతుండగా, ఉగ్ర తూటాలకు గాయపడ్డ జవాను మరణించాడు. పోలీసుల ప్రతి దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా, మరికొందరు అదే ప్రాంతంలో తిష్ట వేసి కాల్పులు జరుపుతున్నారు. వీరిని ఏరివేసేందుకు ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఈ ప్రాంతానికి చేరుకున్న అదనపు బలగాలు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.