: ఇన్వెస్టర్ల సంపదను రూ. 45 వేల కోట్లు పెంచిన టాప్ 7 కంపెనీలు


మార్కెట్ కాపిటలైజేషన్ పరంగా టాప్-10లో ఉన్న కంపెనీలు గత వారంలో ఇన్వెస్టర్ల సంపదను రూ. 45,024 కోట్లు పెంచాయి. ఈ ఎలైట్ జాబితాలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా నష్టపోగా, మిగతా 7 కంపెనీలూ లాభపడ్డాయి. టీసీఎస్ అత్యధికంగా రూ. 16,443 కోట్ల రూపాయలు లాభపడింది. రిలయన్స్ రూ. 6,615 కోట్లు, ఓఎన్జీసీ రూ. 6,245 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ. 6,035 కోట్లు, కోల్ ఇండియా రూ. 5,400 కోట్లు, ఐటీసీ రూ. 2,801 కోట్లు, హెచ్యూఎల్ రూ. 1,482 కోట్లు లాభపడ్డాయి. ఇదే సమయంలో సన్ ఫార్మా రూ. 9,759 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ. 5,241 కోట్లు, ఇన్ఫోసిస్ రూ. 941 కోట్లు నష్టపోయాయి. టాప్-10 సంస్థల్లో టీసీఎస్ రూ. 5.38 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో నంబర్ వన్ స్థానంలో ఉండగా, ఆపై రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, కోల్ ఇండియా, హెచ్యూఎల్, ఓఎన్జీసీ, సన్ ఫార్మాలు కొనసాగుతున్నాయి. గత వారంలో సెన్సెక్స్ 74.05 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 11 పాయింట్లు నష్టపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News