: సొంత రికార్డును బద్దలు కొట్టిన మోదీ!... ఎర్రకోటపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధానిగా రికార్డు!


భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై చేసే ప్రసంగానికి భారత ప్రధానులంతా అత్యంత ప్రాధాన్యమిస్తారు. ఎర్రకోటపై సుదీర్ఘ ప్రసంగం చేసిన ప్రధానిగా... దేశానికి తొలి ప్రధానిగా పనిచేసిన పండిట్ జవహర్ లాల్ పేరిట ఉన్న రికార్డు మొన్నటిదాకా పదిలంగానే ఉంది. అయితే మూడు దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ... జవహర్ లాల్ పేరిట ఉన్న ‘ఎర్రకోటపై సుదీర్ఘ ప్రసంగం’ రికార్డును తన తొలి ప్రసంగంలోనే బద్దలు కొట్టారు. తాజాగా గతేడాది తాను నెలకొల్పిన రికార్డును ప్రధాని మోదీ ఏడాది తిరక్కుండానే తానే బద్దలు కొట్టారు. భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం ఎర్రకోటపై మైకందుకున్న మోదీ... సుదీర్ఘంగా 94 నిమిషాల సేపు ప్రసంగించారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలు, వాటిలో నెరవేరినవెన్నీ, హామీ ఇవ్వకుండానే అమలు చేసిన పథకాలేమిటి? అన్న అంశాలతో పాటు కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం పాక్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తూ మోదీ 94 నిమిషాల పాటు మాట్లాడారు.

  • Loading...

More Telugu News