: బెలూచిస్థాన్ సంగతి మనకెందుకు?... పీఓకేపై దృష్టి పెడితే చాలు!: మోదీ ప్రసంగంపై ఖుర్షీద్ కామెంట్


భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేటి ఉదయం ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ ప్రసంగం విన్న వెంటనే పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ కు చెందిన ఓ రాజకీయవేత్త ‘జైహింద్’ నినాదాలు చేశారు. అయితే పాక్ భూభాగం మధ్యలో ఉన్న బెలూచిస్థాన్ సంగతి మనకెందుకు?... ముందు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పై దృష్టి పెడితే చాలంటూ కాంగ్రెస్ హితవు చెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News