: మోదీ పంద్రాగస్టు ప్రసంగం వింటూ జైట్లీ, పారికర్, అనంత కుమార్ కునుకు!... కేజ్రీ కూడా!
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మోదీ ప్రసంగాన్ని దేశ ప్రజలే కాకుండా విదేశాల్లోనూ పెద్ద సంఖ్యలో జనం విన్నారు. అయితే మోదీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రులుగా ఉన్న ముగ్గురు కేంద్ర మంత్రులు మాత్రం ఎర్రకోట సాక్షిగానే ఓ కునుకేశారు. ఆ మంత్రులెవరంటే... ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్, మరో సీనియర్ మంత్రి అనంత్ కుమార్ తమకు కేటాయించిన సీట్లలో కూర్చునే ఓ కునుకు తీసి మీడియా కెమెరాలకు అడ్డంగా బుక్కయ్యారు. ఇక ఈ వేడుకకు ఢిల్లీ సీఎం హోదాలో హాజరైన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రమంత్రుల మాదిరే కూర్చున్న చోటే ఓ కునుకేశారు.