: పంద్రాగస్టున ఉగ్రవాదుల దాడి... శ్రీనగర్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు శ్రీనగర్ లో రెచ్చిపోయారు. భద్రతా దళాలపై దాడి చేసి కాల్పులు ప్రారంభించడంతో, వెంటనే అప్రమత్తమైన సైన్యం ప్రతిదాడి ప్రారంభించింది. నౌహట్టా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఏడుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడినట్టు తెలుస్తోంది. రోడ్డుకు ఇరువైపులా నక్కివున్న ఉగ్రవాదులు ఒక్కసారిగా సైన్యంపై కాల్పులకు దిగారు. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు స్వయంగా హాజరయ్యే బక్షీ స్టేడియానికి సమీపంలోనే ఇది జరిగింది. దాడికి కొద్ది నిమిషాల ముందే ఎర్రకోటపై నుంచి ప్రధాని ప్రసంగిస్తూ, పాక్ ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఆపై ఉగ్రవాదులు దాడికి దిగాక, వారిని మట్టుబెట్టేందుకు సైన్యం ప్రారంభించిన ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News