: జెండా వందనంపై ఏపీ మంత్రుల్లో రగడ... పలువురి అసంతృప్తి!
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, జిల్లా కేంద్రాలలో జెండా ఆవిష్కరణ చేసే అంశంపై తమకు అన్యాయం జరిగిందని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడుకల వేళ సాధారణంగా జిల్లా మంత్రులు పతాకాలను ఆవిష్కరిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఈ ఏడాది జిల్లా మంత్రులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. విశాఖపట్నంలో యనమల అధికారిక ఉత్సవంలో పాల్గొని జెండా ఎగురవేయనుండగా, తనకు అవకాశం ఇవ్వలేదని మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అలిగినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా రాఘవరావు ఏకైక మంత్రిగా ఉండగా, ఆయన్ను పక్కనబెట్టిన అధికారులు రావెల కిశోర్ బాబుకు చాన్స్ ఇచ్చారు. దీనిపై శిద్ధా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, తిరిగి శిద్ధాను పిలవడంతో, తననెందుకు అవమానించారని రావెల మనస్తాపాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి మాణిక్యాలరావుకు జెండా వందనం అవకాశం లభించగా, ఇదే జిల్లాకు చెందిన పీతల సుజాత తన అసంతృప్తిని తెలిపినట్టు సమాచారం.