: బోల్ట్ నిజంగా చిరుతే!... 9.81 సెకన్లలోనే 100 మీటర్ల రేసును పూర్తి చేసిన అథ్లెట్!


జమైకా అథ్లెట్ ఉసేన్ బోల్డ్ నిజంగా చిరుత పులే. ప్రపంచ పరుగుల వీరుడిగా పేరుగాంచిన బోల్డ్ రియో ఒలింపిక్స్ లోనూ సత్తా చాటాడు. ఇప్పటికే రెండు ఒలింపిక్స్ లలో పరుగు పందెంలో ‘గోల్డ్’ దక్కించుకున్న అతడు... తాజాగా రియోలోనూ పసిడి పతకం సాధించి వరుసగా మూడు ఒలింపిక్స్ లలో బంగారు పతకం నెగ్గిన అధ్లెట్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. రియోలో కొద్దిసేపటి క్రితం ముగిసిన 100 మీటర్ల పరుగు పందెంలో నిర్దేశిత దూరాన్ని 9.81 సెకన్లలోనే పూర్తి చేసిన అతడు ‘పరుగు’లో తనకెవరూ సాటి రారని మరోమారు నిరూపించాడు.

  • Loading...

More Telugu News