: ‘అనంత’కు చంద్రబాబు!... గోల్కొండకు కేసీఆర్!: తెలుగు రాష్ట్రాల్లో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం!


భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికాసేపట్లో దేశవ్యాప్తంగా మొదలు కానున్నాయి. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలు... ఏపీ, తెలంగాణలు కూడా పెద్ద ఎత్తున సంబరాలకు ఏర్పాట్లు చేశాయి. కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించనుంది. ఇప్పటికే అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి కాగా... మరికాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ ప్రారంభం కానున్న వేడుకలకు హాజరుకానున్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అంటూ లేని నవ్యాంధ్రప్రదేశ్... నేటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అనంతపురంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో నిర్వహించనుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తి కాగా... సీఎం నారా చంద్రబాబునాయుడు అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

  • Loading...

More Telugu News