: 55 పరుగులకే కుప్పకూలిన భారత్ 'ఏ' జట్టు
క్వాడ్రఫుల్ వన్డే సిరీస్ లో ఆస్ట్రేలియా 'ఏ' జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత 'ఏ' జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. గల్లీ స్థాయి ఆటతీరుతో ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టడంతో కేవలం 55 పరుగులకే భారత ఏ జట్టు ఆలౌట్ అయ్యింది. ఆటగాళ్ల తీసికట్టు ప్రదర్శనతో 50 ఓవర్లు జరగాల్సిన వన్డే కేవలం 16వ ఓవర్ లోనే ముగిసిందంటే భారత ఆటగాళ్ల ప్రదర్శన ఎంత అమోఘమో ఊహించవచ్చు. దీంతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం చవిచూసింది. అక్షర్ పటేల్ చేసిన 15 పరుగులే భారత ఏ జట్టులో అత్యధిక స్కోరు కావడం విశేషం. దీంతో ఆసిస్ ఆటగాళ్లు కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యం ఛేదించారు. తదుపరి మ్యాచ్ ను భారత ఏ జట్టు 17న సౌతాఫ్రికాతో ఆడనుంది.