: నా కోసం కృష్ణవంశీ ఆ చిత్ర నిర్మాతతో చాలా వాగ్వాదం పెట్టుకున్నాడు!: సినీ హీరో శ్రీకాంత్


తనకు దర్శకుడు కృష్ణవంశీ అంటే చాలా ఇష్టమని సినీ నటుడు శ్రీకాంత్ తెలిపాడు. తన సినీ ప్రస్థానంలో కొన్ని ఘట్టాల గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ, "ఖడ్గం' సినిమా నటుల ఎంపిక జరుగుతున్నప్పుడు నా పేరును వంశీ సదరు చిత్ర నిర్మాతకు చెబితే... ఆయన అస్సలు అంగీకరించలేదట. ఆ పాత్రకు శ్రీకాంత్ సరిపోడని నిర్మాత, శ్రీకాంతే కరెక్టు అని కృష్ణవంశీ వాగ్వాదానికి దిగారు. శ్రీకాంత్ వద్దని నిర్మాత, నేనే కావాలని వంశీ... చాలా రోజులు వాగ్వాదం చేసుకున్నారు. ఆ తరువాత 'శ్రీకాంత్ లేకపోతే నేను వేరే వాళ్లకి ఈ సినిమా చేసుకుంటాను, నువ్వు వెళ్లు' అని నిర్మాతకు కృష్ణవంశీ చెప్పేశాడు. దీంతో గతుక్కుమన్న నిర్మాత... సర్లే, నీ ఇష్టం ప్రకారమే కానీయ్... శ్రీకాంత్ నే తీసుకుందాం' అని నిర్మాత చెప్పాడు. ఆవిధంగా వంశీ నా కోసం పెద్ద ఫైట్ చేశాడు. ఆ తర్వాత నా పాత్రను మలచిన తీరుచూసిన నిర్మాత హ్యాపీగా ఫీలయ్యాడు" అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్. ఆ తరువాత షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో, తాను పెళ్లాం చెబితే వినాలి సినిమాకు డేట్స్ ఇచ్చేశానని, దీంతో కృష్ణవంశీకి కోపం వచ్చిందని, 'ఇదేంట్రా ఇలా చేశావు?' అని అడిగాడని...దానికి 'ఉండ్రాబాబు, మంచి బ్యానర్లో సినిమా వచ్చింది. ఎలాగోలా తంటాలు పడదాం' అని కానిచ్చేశానని శ్రీకాంత్ తెలిపాడు.

  • Loading...

More Telugu News