: 61వ ర్యాంకర్ చేతిలో ఓటమిపాలైన సైనా...రియో నుంచి అవుట్


రియో ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ కథ ముగిసింది. ప్రపంచ 61వ ర్యాంకులో ఉన్న ఉక్రెయిన్ క్రీడాకారిణి మరియా చేతిలో ఐదో ర్యాంకర్ అయిన సైనా నెహ్వాల్ ఓటమి పాలు కావడం విశేషం. బ్యాడ్మింటన్ లో మంచి ఫాంలో ఉన్న సైనాకు ఒలింపిక్ పతకం ఖాయమని అంతా అంచనా వేశారు. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆమె క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో 18-21, 19-21 తేడాతో మరియా చేతిలో ఓటమిపాలై రిక్త హస్తాలతో స్వదేశం తిరిగిరానుంది. కాగా, భారతీయులందరి ఆశలు మోస్తూ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ నేటి రాత్రి 11 గంటలకు పతకం కోసం పోరాడనుంది.

  • Loading...

More Telugu News