: రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వ్యాఖ్యానించిన ఇరోమ్ షర్మిల


మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోరుతూ గత 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేసిన ఉద్యమకారిణి, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. సన్నిహితులు, మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నా రాజకీయాల్లో ప్రవేశంపై వెనక్కి తగ్గే ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. తన రాజకీయ రంగ ప్రవేశంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేసేది లేదని తెలిపారు. 2017లో మణిపూర్ లో జరగనున్న ఎన్నికలకు త్వరలోనే ప్రచారం ప్రారంభిస్తానని ఆమె చెప్పారు. ఆమెకు సొంత రాష్ట్రంలో వ్యతిరేకంగా వ్యాఖ్యలు వినిపిస్తుండగా, బాలీవుడ్ నటి రేణుకా సహానీ వంటివారి మద్దతుపలికిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News