: ముస్లిం సంప్రదాయ వివాహంలో స్పూర్తిమంతమైన కోరిక కోరిన వధువు


హిందూ సంప్రదాయంలో వరకట్నం ఎంత ప్రసిద్ధో... ముస్లిం సంప్రదాయంలో మెహ్ర్ అంత ప్రసిద్ధి. అయితే ఇక్కడ వరుడికి బహుమతులు ఇచ్చినట్టే అక్కడా వరుడికి అత్తింటివారు బహుమతులు ఇచ్చినప్పటికీ... వధువుకు 'మెహ్ర్' మాత్రం విధిగా సమర్పించుకోవాల్సిందే. లేని పక్షంలో వివాహం జరగదు. దీంతో మెహ్ర్ లో తమకు నచ్చిన వస్తువులను వధువు కోరుకుంటుంది. అయితే హైదరాబాదు విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సహ్లా నెచెల్ మాత్రం మెహ్ర్ గా స్పూర్తిమంతమైన కోరిక కోరి వార్తల్లో నిలిచింది. తనను వివాహం చేసుకోవాలంటే నగానట్రా ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతూ ఓ లిస్టు వరుడి బంధువుల చేతిలో పెట్టింది. ఈ లిస్టు చూసినవారంతా ఆశ్చర్యపోయారు. ఆ లిస్టులో ఫిక్షన్, రాజనీతి శాస్త్రం, ఇస్లామిక్ వంటి వివిధ అంశాలపై రచయితలు రాసిన పుస్తకాల పేర్లున్నాయి. దీంతో అంతా సహ్లా నెచెల్ ను అంతా అభినందించారు. ఆమె కాబోయే భర్త అనీస్ బెంగళూరులోని ప్రముఖ పుస్తక కేంద్రాలైన బ్లొస్సోమ్స్‌, గంగారామ్స్‌, బుక్‌ వార్మ్‌ లలో వెతికి మరీ ఆ పుస్తకాలను సహ్లాకు మెహ్ర్‌ గా ఇచ్చి వివాహానికి సిద్ధమయ్యాడు.

  • Loading...

More Telugu News