: ఒలింపిక్స్ వేళ... సోషల్ మీడియాను కుదిపేస్తున్న మూడు వీడియోలు!


రియో ఒలింపిక్స్ ఫీవర్ లో ప్రపంచం మొత్తం ఊగిపోతున్న వేళ సోషల్ మీడియాలో ఓ మూడు వీడియోలు బాగా హల్ చల్ చేస్తున్నాయి. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఏది ఓపెన్ చేసినా ఓ ముగ్గురు బాలలు విన్యాసాలతో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్ ఫ్లిప్స్ జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, బాస్కెట్ బాల్ లో వీరు చేసే విన్యాసాలు నయనానందకరమనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రియో ఒలింపిక్స్ లో పెద్దవాళ్లు పోటీ పడుతుండగా, సోషల్ మీడియాలో తమ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న ముగ్గురికి కనీసం మూడేళ్ల వయసు కూడా ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందే. తల్లిదండ్రుల శిక్షణలో ఆ ముగ్గురూ రాటుదేలడం విశేషం. బ్యాక్ ఫిప్స్, జిమ్నాస్టిక్స్ చేసే పాప తన తండ్రి ఎలా చెబితే అలా, ఆయన ఎలా చేస్తే అలా, ఆయన ఎలా చేయిస్తే అలా చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పాప ప్రేమలో పడిపోతున్నారు. ఇక బాక్సింగ్ లో అమ్మాయి విసిరే పంచ్ ల వేగాన్ని కళ్లు కూడా అందుకోవంటే అతిశయోక్తి కాదు. రెండు చేతులతో ఎంజో లీ బాస్కెట్ బాల్ తో విన్యాసాలు చేస్తుంటే చూడకుండా ఉండలేం...వావ్ అనకుండా ఉండలేం. ఈ ముగ్గురూ భవిష్యత్ ఒలింపిక్ తారలని అంతా అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News