: మువ్వన్నెల జెండా రెపరెపలకు గోల్కొండ కోటలో సర్వం సిద్ధం
భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడేందుకు గోల్కొండ కోటను తెలంగాణ ప్రభుత్వాధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. గోల్కొండ కోటలో సుమారు రెండు నుంచి మూడు గంటలపాటు వీఐపీలంతా గడిపే అవకాశం ఉండడంతో భద్రతాధికారులు కోటను స్వాధీనంలోకి తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు.