: ఏకంగా 8 జీబీ ర్యామ్ తో 'లీ ఎకో' నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్!


ఇప్పటికే లీ1, లీ2 పేరిట రెండు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసి చెప్పుకోతగ్గ అమ్మకాలు సాధించిన చైనా సంస్థ 'లీ ఎకో' తాజాగా 'లీ2ఎస్' పేరిట మరో వినూత్న మోడల్ ను వచ్చే నెలలో తీసుకు రానుందని చైనా టెక్నాలజీ వెబ్ సైట్లు లీకులు ఇచ్చాయి. ఈ ఫోన్ లో 8 జీబీ ర్యామ్ ఉంటుందని సమాచారం. స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్ తో పాటు 64 గిగాబైట్ల మెమొరీ దీని ప్రత్యేకతగా తెలుస్తోంది. ఈ ఫోన్ ఫోటోలను చూస్తుంటే, గతంలో లీ సిరీస్ లో వచ్చిన స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ ధర ఎంత ఉండొచ్చన్న విషయం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందన్న విషయమై లీ ఎకో అధికారిక ప్రకటన వెలువరించాల్సి వుంది.

  • Loading...

More Telugu News