: ట్రంప్ పై నిప్పులు చెరిగిన హాలీవుడ్ హీరో విల్ స్మిత్
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతూ తన నోటి దురుసుతనంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ పై హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ తీవ్రంగా విరుచుకుపడ్డాడు. తన కొత్త చిత్రం 'సూసైడ్ స్క్వాడ్' ప్రమోషన్ నిమిత్తం అరబ్ దేశాల్లో పర్యటిస్తున్న ఆయన ట్రంప్ పై నిప్పులు చెరిగారు. ముస్లింలంటే, అమెరికన్లలో భయాన్ని కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, ఒక్కోసారి వాటిని వింటుంటే బాధ కలుగుతోందని అన్నాడు. ట్రంప్ వ్యాఖ్యలు చాలా క్రూరంగా ఉంటున్నాయని, ఏది మంచో, ఏది చెడో అమెరికన్లు గ్రహిస్తున్నారని చెప్పాడు. చెత్తగా వాగే వాళ్లను దేశం నుంచి ఊడ్చివేసేందుకు అమెరికన్లు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. దుబాయ్ లో ప్రజలు తన చిత్రాలను చూస్తున్నారని, తానిక్కడ ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.