: ఫిగో మోడల్ కార్ల ధరలను రూ. 91 వేల వరకూ తగ్గించిన ఫోర్డ్ ఇండియా


తామందిస్తున్న ఫిగో, ఆస్పైర్ మోడల్స్ కార్ల ధరలను భారీగా తగ్గించినట్టు ఫోర్డ్ ఇండియా వెల్లడించింది. అత్యధికంగా ఆస్పైర్ టాప్ వేరియంట్ పై రూ. 91 వేల వరకూ ధర తగ్గనుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ మెహరోత్రా వెల్లడించారు. ఫిగో టైటానియమ్, ఫిగో టైటానియమ్ ప్లస్ వేరియంట్ల ధరలనూ తగ్గించినట్టు తెలిపారు. కార్ల విడి భాగాలను ఇండియాలోనే తయారు చేస్తుండటం వల్ల ధరలను తగ్గించగలిగామని తెలిపారు. ఫోర్డ్ ఫిగో టైటానియమ్ ధర రూ. 5.94 లక్షల నుంచి రూ. 5.65 లక్షలకు, (డీజెల్), పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.03 లక్షల నుంచి రూ. 6.53 లక్షలకు తగ్గించినట్టు ఆయన తెలిపారు. ఫిగో ఆస్పైర్ టైటానియమ్ ప్లస్ వేరియంట్ ధరపై రూ. 65 వేల తగ్గింపును ప్రకటించామని తెలిపారు. కేవలం మాన్యువల్ గేర్లతో లభించే మోడల్స్ కే ఆఫర్ వర్తిస్తుందని, ఆటోమేటిక్ వర్షన్లకు వర్తించదని వివరించారు.

  • Loading...

More Telugu News