: తన ప్రశ్నకు జవాబిస్తే రూ. కోటి ఇస్తానన్న అల్లు అరవింద్


ఇద్దరమ్మాయిలతో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో అల్లు అరవింద్ సభికులకు సరదాగా భారీ నగదు ఆఫర్ చేశారు. తానడిగిన ప్రశ్నకు జవాబిస్తే రూ. కోటి ఇస్తామన్నారు. ఇంతకీ ఆయన ప్రశ్నేంటంటే.. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ మనస్తత్వం ఎవరికైనా అర్థం అయితే చెప్పాలని సవాల్ విసిరారు. తనకు 20 ఏళ్ళుగా గణేశ్ తెలుసని, అయినా ఇప్పటికీ అతను ఎలా ఆలోచిస్తాడు? ఏం మాట్లాడతాడు? విజయాలు ఎలా వస్తున్నాయి? అన్న విషయాలు తెలుసుకోలేకపోయానని అల్లు అరవింద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ నూ ఈ విషయమై వాకబు చేయగా.. పూరి నుంచి చిరునవ్వే జవాబైంది.

  • Loading...

More Telugu News