: ఏ సమస్య ఉన్నా, ఎవరైనా నాకు చెప్పొచ్చు: చంద్రబాబు విజ్ఞప్తి
వైభవంగా జరుగుతున్న కృష్ణానది పుష్కరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. భక్తులు సహకరించాలని, ఏ సమస్య ఏర్పడినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవరైనా తన ట్విట్టర్ ఖాతాకు సమస్యల గురించి ఫిర్యాదు చేస్తే, వాటిని సాధ్యమైనంత త్వరగా, ప్రాధాన్యతా పూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుపతి నుంచి వచ్చిన వెంకట్రావు అనే కానిస్టేబుల్ మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ, అదో దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదమని, ఇటువంటి ఘటనలు మరోసారి జరుగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని, యాత్రికుల స్పందన అనూహ్యమని అన్నారు.