: హైదరాబాద్ లో హై అలర్ట్... జల్లెడ పడుతున్న పోలీసులు


రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్న తరుణంలో హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఇటీవల నయీమ్ ఎన్ కౌంటర్, అంతకుముందు ఉగ్రవాదులు, వారి సానుభూతిపరుల అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న పోలీసులు, నేటి ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహిస్తున్నారు. పలు కూడళ్లలో మకాం వేసిన పోలీసులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పై దాడులు జరగవచ్చని కేంద్ర నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు కూడా రావడంతో పోలీసులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News