: రోజుకు రూ. 46 వేల వరకూ సంపాదిస్తున్న ఫ్రీలాన్సర్లు... తాజా నివేదికలో ఆసక్తికర విషయాలు!


నిత్యమూ ఇష్టమైనప్పుడు, ఇష్టమైనంత సేపు పని చేసే సౌలభ్యం అందరికీ లభించదు. ఇంట్లోనే ఉంటూ వివిధ కంపెనీలకు తమకు నచ్చిన వేళ, నచ్చినట్టుగా పనిచేస్తుండే ఫ్రీలాన్సర్లు, దేశంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వారి జాబితాలో ఉన్నారని, వీరిలో అనుభవజ్ఞులకు రోజుకు రూ. 46 వేల వరకూ వేతనంగా లభిస్తోందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. 20 సంవత్సరాల అనుభవమున్న వారికి ఈ మేరకు పారితోషికం లభిస్తోందని 'ఫ్లెక్సింగ్ ఇట్' పేరిట ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్ పై జరిగిన అధ్యయనం తరువాత వెల్లడైన నివేదిక పేర్కొంది. ఐదేళ్ల అనుభవమున్న ఫ్రీ లాన్సర్లు రోజుకు రూ. 8 వేలు సంపాదిస్తున్నారని, ఆపై 10 సంవత్సరాల వరకూ అనుభవమున్న వారు రోజుకు రూ. 19 వేలు వెనకేసుకుంటున్నారని వెల్లడించింది. ఆన్ లైన్ ను ప్లాట్ ఫాంగా చేసుకుని వివిధ సంస్థలకు సేవలందిస్తున్న 2,500 మంది ప్రొఫెషనల్స్ ను ఈ అధ్యయనంలో భాగం చేయగా, మాన్యుఫాక్చరింగ్, ఆపరేషన్స్, ఫైనాన్స్, సేల్స్ విభాగాల్లో అత్యధిక పారితోషికాలు అందుతున్నాయి. జనరల్ మేనేజ్ మెంట్, స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాలూ చెప్పుకోతగ్గ వేతనాలను ఫ్రీలాన్సర్స్ కు ఇస్తున్నాయి.

  • Loading...

More Telugu News