: ఈత కొలనులో ఓ శకం ముగిసింది... స్వర్ణంతో కెరీర్ కు ముగింపు చెప్పిన మైఖేల్ ఫెల్ప్స్


సమకాలీన ప్రపంచంలోని తిరుగులేని స్విమ్మింగ్ రారాజు మైఖేల్ ఫెల్ప్స్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. ముందు చెప్పినట్టుగానే నేటి ఉదయం జరిగిన 4X100 మీటర్ల మెడ్లే అతనికి ఆఖరి పోటీ అయింది. ఇందులో స్వర్ణం సాధించి, 23వ ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకున్న ఆయన సగర్వంగా అభిమానులకు చేతులూపుతూ ఈత కొలను నుంచి నిష్క్రమించాడు. ఒలింపిక్స్ లో భాగంగా స్విమ్మింగ్ పోటీలు నేటితో ముగియగా, 3.27.95 నిమిషాల్లో యూఎస్ టీం లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణం దక్కించుకుంది. 100 మీటర్ల బటర్ ఫ్లయ్ లో రజతంతో సరిపెట్టుకున్న ఫెల్ప్స్, ఆట నుంచి రిటైర్మెంట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రియోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో ఐదు స్వర్ణాలు, ఒక రజతపతకం ఫెల్ప్స్ ఖాతాలో చేరాయి. ఫెల్ప్స్ రిటైర్ మెంటుతో ఈత కొలనులో ఓ శకం ముగిసినట్లయింది. ప్రపంచ ఒలింపిక్స్ చరిత్రలో మైఖేల్ ఫెల్ప్స్ రికార్డును తిరగరాయాలంటే చాలా కష్టమని క్రీడా పండితులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News