: పంద్రాగస్టు వేడుకల ముందు, కాల్పులకు తెగబడ్డ పాక్
పూంచ్ సెక్టారులో భారత పోస్టులపై పాక్ సైన్యం ఈ ఉదయం కవ్వింపు కాల్పులకు దిగింది. జాతి యావత్తూ రేపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకునేందుకు సిద్ధమైన వేళ, జమ్మూ రీజియన్ లోని వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ కాల్పులు జరుపుతున్నట్టు ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా వెల్లడించారు. వారు చిన్న చిన్న తుపాకులు, ఆటోమేటిక్ ఆయుధాలతో భారత పోస్టులపై కాల్పులు జరుపుతున్నారని, అవి ఇంకా కొనసాగుతున్నాయని వివరించారు. పాక్ కాల్పులతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు.