: 2008లో ‘ఫెల్ఫ్స్’ ను కలిశాడు... ఇప్పుడతన్నే ఓడించాడు... రియో 'ఈత కొలను'లో పెను సంచలనం
మైఖేల్ ‘ఫెల్ఫ్స్’ ఈత కొలనులో బరిలోకి దిగాడంటే, రెండో స్థానం ఎవరిదన్న ఆలోచనలోనే ప్రపంచం ఉంటుంది. ఎందుకంటే, ‘ఫెల్ఫ్స్’ ను ఓడించే మరో వ్యక్తి ఆ కొలనులో ఉండడన్నది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఇప్పటికే ఒలింపిక్స్ లో 21 స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుని, ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న ‘ఫెల్ఫ్స్’ 22వ పతకం వేటలో మాత్రం ప్రతి ఒక్కరి అంచనాలు తలకిందులు చేస్తూ, రెండో స్థానానికి పరిమితమయ్యాడు. అతన్ని ఓడించింది ఎవరో తెలుసా? సింగపూర్ కుర్రాడు జోసెఫ్ స్కూలింగ్. 100 మీటర్ల బటర్ ఫ్లయ్ పోటీ జరుగగా, ‘ఫెల్ఫ్స్’ కు షాకిచ్చిన సోసెఫ్, అతనికన్నా 50.39 సెకన్ల ముందే గమ్యాన్ని చేరాడు. అన్నట్టు, మైఖేల్ ‘ఫెల్ఫ్స్’ కు జోసెఫ్ వీరాభిమాని. 2008లో ‘ఫెల్ఫ్స్’ తో కలసి ఓ ఫోటో కూడా దిగాడు. అతన్నే ఆరాధిస్తూ, ఈత కొలనులో ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు తన హీరోనే ఓడించే స్థాయికి చేరాడు. అన్నట్టు సింగపూర్ కు ఒలింపిక్స్ లో ఇదే తొలి బంగారు పతకం. ఈ ఘనతను సాధించినందుకు జోసెఫ్ కు సింగపూర్ ప్రభుత్వం రూ. 5 కోట్ల బహుమతిని ప్రకటించింది. ‘ఫెల్ఫ్స్’ ఓటమి రియో ఈత కొలనులో పెను సంచలనమే!