: నేను డీజీపీగా ఉన్నప్పుడు 'నయీమ్ పెద్ద క్రిమినల్' అన్న రికార్డు లేదు: దినేష్ రెడ్డి


తాను డీజీపీగా ఉండగా నయీమ్ పెద్ద క్రిమినల్ కాదని మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్ తో ఆయన ఈ సాయంకాలం ప్రత్యేకంగా మాట్లాడుతూ, నయీమ్ ను పోలీసులే పెంచి పోషించారని అన్నారు. పొలీసు అధికారులకు తాయిలాలు ఏరా వేసి, నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడని ఆయన చెప్పారు. తాను డీజీపీగా ఉండగా నయీమ్ హత్యలు మాత్రమే చేశాడన్న సమాచారం ఉందని అన్నారు. అతను సమాజానికి ఇబ్బందిగా పరిణమిస్తున్నాడు, చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే పోలీసు అధికారులకు తెలిపానని ఆయన చెప్పారు. అయతే అప్పట్లో అతను పోలీసులకు ఉపయోగపడే కీలకమైన సమాచారం ఇస్తున్నాడన్న కారణంతో అతని విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించి ఉండవచ్చని అన్నారు. ఇలాంటి అలసత్వం కారణంగానే నయీమ్ ఇంత పెద్ద క్రిమినల్ గా మారాడని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News