: ప్రధాని మోదీ ఆధ్యాత్మిక గురువు స్వామీ మహరాజ్ ఇకలేరు!


బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థ పీఠాధిపతి స్వామీ మహరాజ్(95) గుజరాత్ సారంగ్‌పూర్‌లో ఈరోజు తుదిశ్వాస విడిచారు. త‌న‌ ఆధ్యాత్మిక గురువు ఆయిన ఆయ‌న మృతి చెంద‌డం ప‌ట్ల ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. స్వామి మ‌హ‌రాజ్ సేవకు మారుపేరుగా నిలిచార‌ని మోదీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆయ‌న చేసిన‌ సేవా కార్యక్రమాలను సమాజం మరవబోదని మోదీ అన్నారు. తనను నడిపించిన గురువు లేని లోటు పూడ్చలేనిదని, స్వామి మహరాజ్ బోధనలు తనకు ఎప్పటికీ గుర్తుంటాయని ప్రధాని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News