: సల్మాన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడన్నది నాకే కాదు, దేవుడికి కూడా తెలీదు: తండ్రి సలీమ్ ఖాన్


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ వివాహం గురించి ఆయన తండ్రి సలీమ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రచయిత అయిన సలీమ్ ఖాన్ త్వరలో ఓ రేడియో షోను హోస్ట్ చేయనున్నారు. ఈ షో గురించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు పెట్టిన ఆయన... ఈ షోలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా సమాధానం ఇస్తానని, ఒక్క సల్మాన్ పెళ్లికి సంబంధించిన ప్రశ్నలకు మాత్రం తప్ప అన్నారు. ఎందుకంటే, సల్మాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడన్న విషయం తనకే కాదు, ఆ దేవుడికి కూడా తెలియదని ఆయన చమత్కరించారు. ముంబై లోకల్ రేడియో 'రేడియో నషా 919'లో '70 ఎంఎం' అనే షోను ఆయన నిర్వహించనున్నారు. కేవలం వారాంతాల్లో రెండు రోజుల పాటు నిర్వహించే ఈ షోలో రోజూ రెండు గంటలపాటు అభిమానుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తారు.

  • Loading...

More Telugu News