: బీచ్‌లో కూల్ డ్రింక్ కొనుక్కుంటే.. అందులో వానపాము ప్రత్యక్షమైంది!
ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో థమ్సప్ బాటిల్ లో పురుగులు కనిపించిన ఘటన మరువకముందే, అటువంటిదే మరోఘటన నెల్లూరులో తాజాగా వెలుగులోకొచ్చింది. వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడానికి కూల్ డ్రింక్ కొనుక్కొన్న ఓ వ్యక్తికి అందులో వానపాము కనిపించింది. వాకాడు మండలంలోని తూపిలిపాళెం బీచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. అక్కడే ఉన్న ఓ కూల్‌డ్రింక్ షాపులో కూల్‌డ్రింక్ కొనుక్కున్న ఓ వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. విషయాన్ని తెలుసుకున్న పర్యాటకులు కూల్ డ్రింక్‌లో వానపాముని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.